ఇదే నిజం, జోగిపేట: రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆందోలు నియోజకవర్గ అభివద్దికి రూ.500 కోట్ల వరకు నిధులను మంజూరు చేయించానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ అన్నారు. శనివారం జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రేస్ పార్టీలో చేరిన సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. రెండు సంవత్సరాల్లో నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. చేసిన పనులు చెప్పుకునే అలవాటు లేదని, గతంలో నియోజకవర్గానికి జెఎన్‌టీయు, మూడు పాలిటెక్నిక్ కళాశాలలు, సేద్యానికి సింగూరు జలాలు, పీజీ కళాశాలలు మంజూరు చేయించానన్నారు.
ఈ సారి జెఎన్‌టీయులో రూ.40 కోట్లతో సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను మంజూరు చేయిస్తున్నానని, సింగూరు కాలువ లైనింగ్ పనులకు రూ.190 కోట్లు నర్సింగ్ కాలేజీకి రూ.55 కోట్లు, రూ.60 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం, రూ.89 కోట్లతో అజ్జమర్రి వంతెన నిర్మాణం, రూ.20 కోట్ల సంగుపేట నుంచి అన్నాసాగర్ వరకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం పనులకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. అందోలు, సింగూరును పర్యాటక కేంద్రంగా అభివద్ది చేస్తానని, రూ.100 కోట్లతో సింగూరు–బుదేరా రోడ్డు నిర్మాణం చేపడతామని, సంగుపేట–డాకూరు రోడ్డు మద్యలో పది ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కషి చేస్తానని తెలిపారు.
సమీకత కార్యాలయాల నిర్మాణం పనులకు నిధులు మంజూరు చేయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందోలు, సింగూరులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. రెండు ఏళ్లలో చేపట్టే ఈ అభివద్ది పనులతో జోగిపేటకు పూర్వవైబం వస్తుందని, వ్యాపార లావాదేవీలు పెరగనున్నాయన్నారు. ఈ ప్రాంతం నాదేనన్న తపన ఉన్నప్పుడే అభివద్ది చెందే అవకాశం ఉంటుందన్నారు. జరగబోయే లోకసభ ఎన్నికల్లో నా మిత్రుడు కాంగ్రేస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను గెలిపించుకోవాలని, అందుకు అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జోగిపేట మున్సిపల్ చైర్మన్ జి.మల్లయ్య, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మొహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, ఆకుల చిట్టిబాబు, డి.శివశంకర్, రంగ సురేష్, కే.నాగరాజు, ప్రవీణ్‌కుమార్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.