Homeహైదరాబాద్latest Newsజైనూర్‌లో రూ.7 లక్షలు పట్టివేత

జైనూర్‌లో రూ.7 లక్షలు పట్టివేత

ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్: జైనూర్ మండలం ఉషేగామ్ గ్రామ శివారులో ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.7,31,150 నగదును పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా జైనూర్ నుంచి ఉట్నూర్ వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఆపారు. అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని విజయ కుమారిగా పోలీసులు గుర్తించారు. నగదును జప్తు చేసి జైనూర్ ఫ్లయింగ్ స్క్వాడ్ కి అప్పగించినట్లు సీఐ అంజయ్య పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో సిర్పూర్ ఎస్ఐ మాధవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img