RTC and electricity Charges Hike in telangana : ఎలచ్చన్ అయిపాయె.. ఇగ చార్జీల మోతే..
తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. ఇందుకు సంబందించి ప్రభుత్వం తరపున అనుమతులు వచ్చినట్లు తెలుస్తుంది.
వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉందన్న పేరుతో ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు డిస్కంల నుంచి తేరుకునేందుకు అనే కారణాలు చేపుతూ ప్రజలపై భారం వేసి వీపు విమానం మోత మోయించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
ఇక ఈ సంస్థలు తమ సేవలకు వసూలు చేస్తున్న చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
పెంచిన చార్జీలు వచ్చే వారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక ఇప్పటికే రాష్ట్రంలో వివిధ రూపాలలో చార్జీల మోత మోపే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం హుజూరాబాద్ ఎలక్షన్ల దృష్యా కాస్త ఆగింది.
ఆ ఎలక్షన్లు కాస్త అయిపోవడంతో ఇక మోతను ఆపేది లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది.
విద్యాశాఖ, ఆరోగ్య శాఖ వంటి శాఖల నుంచి కూడా ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఉండదు.
అయినా వాటిని ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలుగా భావించి వాటి వ్యయాన్ని భరిస్తుంది.
అలాగే ఆర్టీసీ, విద్యుత్ శాఖలు కూడా ప్రజలకు సేవలు అందించేవి కాదా వీటిపై ప్రభుత్వం నిధులను ఖజానా నుంచి ఉపయోగించాలి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.