రైతు భరోసా పై అన్నదాతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఓ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం ఇదే రోజు 10 సంవత్సరాల నిరంకుశ పాలనకు చమర గీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, గడిచిన పది సంవత్సరాల్లో మాయమాటలు నమ్మి రాజ్యం అప్పగిస్తే గత పాలకులు సంపద కొల్లగొట్టారన్నారు. 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పు కింద ప్రతి సంవత్సరం 6,500 కోట్ల రూపాయలు కడుతుందని అన్నారు.