తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు సిద్దమయ్యింది. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు సంక్రాంతి పండుగకు అన్నదాతల అకౌంట్లలో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే డిసెంబర్ 28న భూమిలేని నిరుపేదలకు మొదటి విడతగా రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.