తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం తాజాగా రైతు భరోసా(Rythu Bharosa) నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రైతు భరోసా కింద 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,126.54 కోట్లు జమ అయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూడో విడత నిధులు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1,126.54 కోట్లు జమ అయ్యాయని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు భరోసా నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. మూడో విడత నిధులు త్వరలో విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చాలా మంది రైతులు తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికీ కీలక అప్డేట్ ఇచ్చింది. రైతులకు హామీ ఇచ్చినట్లుగా రైతుభరోసా పంట పెట్టుబడి సహాయ నిధులను నిర్ణీత వ్యవధిలో అందరికీ చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని తెలిపింది.
ALSO READ: ఇందిరమ్మ ఇళ్ల పై కీలక ప్రకటన.. అర్హులందరికి ఇండ్లు..!