ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి రైతు వేదికలో మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకి రైతులకు రైతు నేస్తం కార్యక్రమం(వీడియో కాన్ఫరెన్స్) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు మల్లికార్జున్ రెడ్డి సమగ్ర వ్యవసాయ పద్ధతులు గురించి మరియు నేరుగా విత్తే వరి సాగు పద్ధతులు గురించి తన అనుభవాలను తోటి రైతులతో పంచుకోవడం జరిగింది. శాస్త్రవేత్త గోవర్ధన్ సమగ్ర వ్యవసాయ పద్ధతులు గురించి రైతులకు వివరించడం జరిగింది. రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఏ డి ఏ రామచంద్రం,మండల వ్యసాయాధికారి కరుణ, ఏఈవోలు గంగాధర్ నాయక్, శ్రీహరి, అలేఖ్య, అశ్విన్,వంశీ, రైతులు పాల్గొన్నారు.