Homeఫ్లాష్ ఫ్లాష్#KCR #Rythubandhu : 27 నుంచి రైతుబంధు పంపిణీ

#KCR #Rythubandhu : 27 నుంచి రైతుబంధు పంపిణీ

The Chief Minister conducted a review with the KCR officials in Pragati Bhavan regarding the distribution of the second release Rythubandhu. The review meeting was attended by Agriculture Minister Niranjan Reddy, CS Somesh Kumar, Finance and Agriculture Chief Secretaries.

ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల (జనవరి) 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు.
దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని చెప్పారు.
యాసంగి సీజన్ రైతుబంధు సహాయం (రెండో విడత) పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు.

రెండో విడుత రైతుబంధు పంపిణీకి సంబంధించి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ స‌మీక్ష స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు రైతుబంధు పంపిణీ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

రాష్ర్టంలో ప్ర‌తి ఒక్క రైతుకు అందించాల‌న్నారు. రైతుల ఖాతాలోనే నేరుగా డ‌బ్బు జ‌మ చేయాల‌ని ఆదేశించారు.

రైతుబంధు కోసం రూ. 7,300 కోట్లు విడుద‌ల చేయాల‌ని ఆర్థిక శాఖ‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రైతులంద‌రికీ ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో డ‌బ్బులు జ‌మ చేయాల‌న్నారు.

Recent

- Advertisment -spot_img