Homeహైదరాబాద్latest Newsశభాష్ మాధవి.. తెగువ చూపిన మగువ

శభాష్ మాధవి.. తెగువ చూపిన మగువ

పాతబస్తీ చరిత్ర ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు మరో మరో లెక్క. ఎందుకంటే అక్కడ ఆడపులి మాధవీలత అడుగుపెట్టింది. ఆమె రాకతో పాతబస్తీని చరిత్రను కొత్త సిరాతో లిఖించాల్సివస్తోంది. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ పోలింగ్ కేం ద్రాలుంటాయి? అక్కడ ఏజెంట్లుగా ఎవరు కూర్చుం టారు? అసలు ఆయా పోలింగ్ బూత్ లలో ఓటర్లు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఓటేసేందుకు వచ్చారు? ఎన్నిఓట్లు పడ్డాయి? అంటే ఇన్ని రోజులు ఎంఐఎం లీడర్లు ఏం చెప్పాలని శాసిస్తేపోలింగ్ అధి కారులు అదే చెప్పేవారు. అక్కడ ఎంఐఎం లీడర్లు చెప్పిందే వేదం. ఒవైసీ బ్రదర్స్ చేసిందే శాసనం. వాళ్లు చెప్పినట్టు పోలింగ్ ఆఫీసర్లు వినాల్సిందే. ఎంఐఎం లీడర్ల కనుసన్నల్లో ఓటింగ్ నిర్వహించి ఈవీఎం బాక్స్ లు తీసుకెళ్లాల్సిందే. ఇక దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలు కూడా అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ నట్టనడిబొడ్డున ఇటువంటి ఆటవిక చర్యలు సాగేవి. ప్రశ్నించేవారు లేరు.. కంప్లయింట్ ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు.కానీ ఈ ఎన్నికలో లెక్కలు మారాయి. పాతబస్తీలోని పోలింగ్ కేంద్రానికి బీజేపీ అభ్యర్థి మాధవీలత దర్జాగా వెళ్లారు. అక్కడి అధికా రులను నిలదీశారు. అక్కడి ఓటర్లను ప్రశ్నించారు. ఇంతకాలం పాతబస్తీ చరిత్ర తెలిసిన వాళ్లంతా మాధవీలత తెగువకు మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు. మాధవీలత ఇక్కడి నుంచి గెలిచినా ..ఓడినా ఆమె నమోదు చేసిన విజయాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేమహిళలకు ఆమె దారి చూపింది. ఇన్నాళ్లు ఒవైసీలకు సలాం కొట్టిన వారినే చూశాము ఇప్పుడు సవాల్ విసిరే వీర నారిని చూశామంటున్నారు పాతబస్తీ వాసులు.

ఆమె తెగువకు హాట్సాఫ్
మాధవీలత పేరు అనౌన్స్ చేసినప్పుడు పెద్దగా ఇక్కడ హడావుడి లేదు. ప్రతి దఫాలాగే ఇక్కడ ఓ బీజేపీ అభ్యర్థి ఐరిలో ఉంటారు? ఎలాగూ ఓడిపో తారు. అని అంతా భావించారు. కానీ ఈ సారి ఎన్నిక గతంలోలా లేదు. మాధవీలత అక్కడి జరు గుతున్నదౌర్జనాన్ని నడిబజారులో నిలబెట్టారు. పా తబస్తీలో ఎన్నిక ఎంత అప్రజాస్వామికంగా జరు గుతుందో పూసగుచ్చినట్టు వివరించారు. అక్కడ మహిళల జీవితాలు, పేదల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో మీడియాకు తెలిపారు. దీంతో ఆమె తెగువకు కులమతాలకు అతీతంగా సపోర్ట్ దక్కింది. అందుకే అందరూ ఆమె తెగువకు హాట్సాఫ్ చెబుతున్నారు.

బీజేపీకి ఆ మచ్చ పోయింది!
బీజేపీకి ఎంఐఎం బీటీమ్ అని… కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు పడకుండా బీజేపీకి ఎంఐఎం పరోక్షం గా సహకరిస్తుందని కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తుం టారు. గతంలో మహారాష్ట్రలో, కర్ణాటకలో ముస్లిం ప్రాబల్యం ఉన్న చోట ఎంఐఎం పోటీ చేయడంతో ఈ ఆరోపణ నిజమేనని అంతా నమ్మారు. వెరసి బీజేపీకి కొంత నష్టం జరిగేది. కానీ ఇప్పుడు పాతబస్తీ లాంటి చోట ఓ బలమైన అభ్యర్థిని బీజేపీ రంగంలోకి దింపింది. ఎంఐఎం ఓటమి కోసం సర్వశక్తులు ఒడ్డింది. దీంతో బీజేపీ.. ఎంఐఎంకు బీటీమ్ అన్న ముద్ర జనం మనసులోంచి క్రమంగా పోయింది. అంతేకాక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు పరోక్షంగా సహకరించింది. అక్కడ బలహీన అభ్యర్థిని బరిలో దించింది. దీన్ని బట్టి.. కాంగ్రెస్ పార్టీయే ఎంఐఎంకు సహరిస్తుందని అంతా భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా మారుమోగిన హైదరాబాద్ పేరు
పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని సెగ్మెంట్లను మాత్రమే దేశప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ప్రధానపార్టీలకు సంబంధించిన టాప్ లీడర్స్ పోటీ చేసే స్థానాలు అమేథీ, రాయబరేలీ, వారణాసి, వయనాడ్ వంటి సెగ్మెంట్లు మాత్రం జనం మదిలో మెదులుతుంటాయి. కానీ ఈ సారి హైదరాబాద్ పేరు జాతీయ మీడియాలో ప్రధాన అంశంగా మారింది. ఒవైసీ మీద ఓ మహిళ పోటీ చేయడం.. తెగువతో ప్రకటనలు చేస్తుండటంతో అందరి దృష్టి ఇక్కడ కేంద్రీకృతమైంది.

మాధవీలత ఏం సాధించారు?
గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ ఎన్నికల్లో మాధవీలత అనేక విజయాలు సాధించారు. ఆమెకు తెలుగు, హిందీ, ఉర్దూ మూడు భాషల్లోనూ పట్టు ఉంది. జనంలోకి చొ చ్చుకెళ్లగలిగారు. వాళ్ల సమస్యలను తెలుసుకున్నా రు. దాన్ని మీడియాకు వివరించారు. పాతబస్తీలో కులమతాలకు అతీతంగా పేదరికం ఉందని చర్చ జరిగింది. పాతబస్తీలో ఉండే మతఛాందస రాజకీ యాలను ఆమె ప్రపంచానికి చాటి చెప్పారు. పాత బస్తీలో దొంగ ఓట్లు వేస్తారని.. రిగ్గింగ్ జరుగు తుందని చాలా మంది గుసగుసలాడుకొనేవారు. కానీ మాధవీలత ఈ విషయాన్ని నేరుగా బాహ్యం ప్రపంచానికి వివరించారు. చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని రియాసత్ నగర్ బూత్ నంబర్ 40లో ఓ ఇంట్లోనే ఎన్నో ఏండ్లుగా జరుపుతున్నారు. ఓ కుటుంబం నివాసం ఉండగానే అక్కడ పోలింగ్ జరపడటం గమనార్హం. ఈ విషయాన్ని మాధవీలత వెలుగులోకి తీసుకొ చ్చారు. ఇక హైదరాబాద్ లో ఆమె పోరాట పటిమ చూసిన తర్వాత బీజేపీ అధిష్టానం పెద్ద పదవి ఇచ్చే చాన్స్ ఉంది. ఆమె గెలిస్తే కచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కనున్నది. ఒకవేళ ఓడిపోయినా కీలక పదవి దక్కే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు రాలిగా.. లేదంటే జాతీయ స్థాయిలో ఓ కీలక పదవి ఆమెకు ఇచ్చే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img