Homeతెలంగాణస్టూడెంట్స్ డిమాండ్​ మేరకే ప్రైవేటు యూనివర్సిటీలు

స్టూడెంట్స్ డిమాండ్​ మేరకే ప్రైవేటు యూనివర్సిటీలు

న్యాయ పరమైన చిక్కులతోనే వీసీలు, ఫ్యాకల్టీ నియామకాలు ఆలస్యం
అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి సబితమ్మ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్​: విద్యార్థల నుంచి డిమాండ్‌ వచ్చినందుకే రాష్ట్రంలో ప్రవేటు యూనివర్సిటీల ప్రతిపాదన తెచ్చామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లుపై సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేయడం లేదని, త్వరలోనే వీసీలను, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియకు ఇదివరకే అనుమతులు మంజూరు చేశామని.. కానీ న్యాయ పరమైన సమస్యల వల్ల అలస్యం అవుతుందోని అన్నారు. ఇక, ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించి 16 ప్రతిపాదనలు రాగా, 8 ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించిందని, వాటిలో ఐదింటికి ఆమోదం కూడా తెలిపామని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉన్నత విద్యను పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్బంగా మంత్రి అన్నారు. మనదేశంలో 950 యూనివ‌ర్సిటీలు ఉన్నాయని.. అందులో 53 సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలు, 412 స్టేట్ యూనివ‌ర్సిటీలు, 124 డీమ్డ్ యూనివ‌ర్సిటీలు, 361 ప్రైవేటు యూనివ‌ర్సిటీలన్నాయని తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య పెరుగుతుందని, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

Recent

- Advertisment -spot_img