Homeస్పోర్ట్స్కోహ్లి లేకపోతే కష్టమే.. మ‌యాంక్ దానికి స‌రైనోడు.. సచిన్‌

కోహ్లి లేకపోతే కష్టమే.. మ‌యాంక్ దానికి స‌రైనోడు.. సచిన్‌

న్యూఢిల్లీ: స్మిత్‌, వార్నర్‌ వంటి సీనియర్లకు లబుషేన్‌ తోడైతే ఆసీస్‌ బ్యాటింగ్‌ యూనిట్‌ మరింత మెరుగవుతుందని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈసారి ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇందుకు భారత జట్టు సిద్ధంగా ఉంది. నిజానికి కెప్టెన్‌ కోహ్లి జట్టుతో లేకపోవడం తీర్చలేని లోటేన‌న్నారు.

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉందన్న లిటిల్‌ మాస్టర్‌.. కంగారూ బ్యాట్స్‌మెన్‌ను సమర్థవంతంగా కట్టడి చేసేందుకు టీమిండియా ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు.

టెస్టుల్లో ఓపెనర్‌ స్థానానికి అతడే సరైన ఆప్షన్

టీమిండియా క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌పై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఆసీస్‌ టూర్‌ నేపథ్యంలో టెస్టుల్లో ఓపెనర్‌ స్థానానికి అతడే సరైన ఆప్షన్‌ అని పేర్కొన్నాడు.

మయాంక్‌ స్కోరు(రన్స్‌) ఎంతో మెరుగ్గా ఉంది. కాబట్టి కచ్చితంగా ఒక మంచి ఓపెనర్‌ అవుతాడు. ఒకవేళ రోహిత్‌ ఫిట్‌నెస్‌ సాధించి, జట్టుతో చేరితే మయాంక్‌ తనకు మంచి జోడీ అవుతాడన్నాడు.

పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌ల విషయంలో మేనేజ్‌మెంట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. నాకు తెలిసి ఫాంలో ఉన్నవాళ్లను పక్కనపెట్టే అవకాశం ఉండదు’’ అని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున 11 మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ అగర్వాల్‌ 424(స్ట్రైక్‌ రేటు 156.45) పరుగులు చేశాడు.

రోహిత్ దూర‌మైతే.. అత‌డికి అవ‌కాశం

చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులోకి వస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. అలా జరగని పక్షంలో హిట్‌మాన్‌ స్థానంలో శ్రేయస్‌ అ‍య్యర్‌ను రిజర్వ్‌ ఆటగాడిగా తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది.

Recent

- Advertisment -spot_img