Homeజిల్లా వార్తలుపాపం.. నర్సంపేటలో మిర్చీ రైతుకు కన్నీళ్లు

పాపం.. నర్సంపేటలో మిర్చీ రైతుకు కన్నీళ్లు

– క్వింటాలుకు 50 కిలోల తాలు
– పెట్టుబడి కూడా రాని పరిస్థితి
– తెగుళ్లతో కుదేలవుతున్న రైతన్న

ఇదే నిజం, నర్సంపేట: మిర్చీ రైతుకు కష్టాలు వెంటాడుతున్నాయి. క్వింటాల్​ మిర్చీ పంటకు 50 కిలోల తాలు వస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు తన పొలంలో క్వింటా మిర్చి పంట దిగుబడి సాధిస్తే అందులో కేవలం ఐదు నుండి పది కిలోలు మాత్రమే తాలూ మిర్చి ఉండేది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంగా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక మార్కెట్​ లో ఆశించిన స్థాయిలో ధర కూడా రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. నర్సంపేట డివిజన్ పరిధిలో మిరప సాగు కష్టాల సుడిలో చిక్కుకుంది. మిర్చీ పంటకు గుబ్బ తెగులు, ఆకు ముడత తెగులు వంటి తెగుళ్లతో మిర్చీ పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంట పూత, పిందే సమయంలోనూ తుఫాన్​ సోకి నష్టం వచ్చింది.

డివిజన్ వ్యాప్తంగా 6660 ఎకరాల్లో మిర్చి సాగు
వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం నర్సంపేట డివిజన్లో 6,660 ఎకరాల్లో రైతులు మిర్చీ పంట సాగుచేస్తున్నారు. నల్లబెల్లి మండల పరిధిలో 1375 ఎకరాలు, నెక్కొండ మండల పరిధిలో 320 ఎకరాలు, దుగ్గొండి మండల పరిధిలో 3480 ఎకరాలు, ఖానాపురం మండల పరిధిలో 875 ఎకరాలు, చెన్నారావుపేట మండల పరిధిలో 610 ఎకరాలు సాగు చేస్తున్నట్టుగా వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎర్ర బంగారం రైతులు ఎర్ర మిరపకాయల కంటే తెల్ల కాయలు అధికంగా కనిపించడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఇటీవల తెల్ల మిరప క్వింటా ధర రూ 14000 పలకగా ప్రస్తుతం కనిష్ట ధర 6000 పలుకుతుంది. మిర్చి ఏరడానికి రైతుల కూలి అధనం కావడంతో రైతులు గిట్టుబాటు ధర లేక ఆందోళన గురవుతున్నారు.

ఏం చేయాలో పాలు పోవట్లేదు?
రెండు ఎకరాల్లో మిరప సాగు చేశాను. ఈ ఏడాది తుఫాన్ తెగుళ్ల కారణంగా పెట్టుబడులు అధికమయ్యాయి. ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి పెట్టాను. సగానికి పైగా చేనులో తాలుకాయలు ఉన్నాయి. మిరప ధరలు పతనం అవడం ఆందోళన కలిగిస్తుంది. క్వింటా మిరప రూపాయలు 25 వేల వరకు ఉంటే గిట్టుబాటు అవుతుంది.

– కక్కెర్ల శ్రీను, రైతు లెంకాలపల్లి

Recent

- Advertisment -spot_img