సడక్ 2 సినిమాపై విరుకుపడుతున్న నెటిజన్లు
ముంబాయి: ఇంత దారుణమైన సినిమాను ఇంతకు ముందెన్నడూ చూడలేదంటూ సినీ అభిమానులు ‘సడక్ 2’కు పరమ చెత్త సినిమా అవార్డును కట్టబెట్టారు. ఆలియాభట్ ప్రధాన పాత్రలో ఆమె తండ్రి మహేష్‌భట్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్ రికార్డు స్థాయిలో కోటికిపైగా డిస్‌లైకులు రావడం మరో విశేషం. ఆగస్టు 28న ఓటీటీలో విడుదలైన దీన్ని చూసిన అభిమానులు ట్రైలర్‌కు తగ్గట్లుగానే సినిమా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పదివేల మంది అభిమానులు ఐఎండీబీలో 10కి 1.1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీంతో ఐఎండీబీలో అత్యంత దారుణమైన రేటింగ్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ఐఎండీబీలో 1.3 స్టార్ రేటింగ్‌తో టర్కీ సినిమా రెండో స్థానంలో ఉంది. బాలీవుడ్ చిత్రాలు హిమ్మత్‌వాలా 1.7, రామ్‌గోపాల్ వర్మ ‘ఫైర్’ 1.7, అభిషేక్ బచ్చన్ ‘ద్రోణ’, హిమేష్ రేష్మియా ‘కర్జ్’ చిత్రాలు 2 రేటింగ్ తెచ్చుకున్నాయి.
ఇంత దారుణమైన సినీమానా..
RELATED ARTICLES