Homeహైదరాబాద్latest Newsలేడీస్‌తోనే ఇబ్బందులు, విడాకులు : సయీద్ అన్వర్

లేడీస్‌తోనే ఇబ్బందులు, విడాకులు : సయీద్ అన్వర్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అండ్ కెప్టెన్ సయీద్ అన్వర్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘మహిళలు ఉద్యోగాలు చేయడం వల్లే విడాకులు ఎక్కువవుతున్నాయి. గడిచిన మూడేళ్లలో పాక్‌లో విడాకులు 30 శాతం పెరిగాయి. సొంతంగా డబ్బు సంపాదిస్తున్నందుకు వారు గొప్పగా ఫీల్ అవుతున్నారు. విదేశాల్లో కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. దంపతులు తరచూ గొడవపడుతూనే ఉన్నారు. ప్రపంచమంతా ఇదే సమస్య. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా మేయర్ కూడా నాతో ఇదే అభిప్రాయాన్ని చెప్పారు’ అని అన్నారు. సోషల్ మీడియాలో మహిళలు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

Recent

- Advertisment -spot_img