ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల రీజనల్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ల యూనియన్ ఎన్నికలు జరగగా జగిత్యాల జిల్లా గోల్డ్ అప్రైజర్ అసోసియేషన్ కి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి గ్రామానికి చెందిన సజ్జనపు అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సజ్జనపు అశోక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జగిత్యాల రీజనల్ అప్రైజర్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.