పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న మూవీ సలార్ పార్ట్ –1 సీస్ ఫైర్. వచ్చే నెల 22న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకి రానుంది. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొని ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సలార్ రిలీజ్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్లు హాలీవుడ్ మూవీస్‌ని తలదన్నేలా ఉండనున్నాయనేది లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్. ఇక ఈ యాక్షన్ సీన్స్ షూటింగ్ కోసం ఏకంగా 750 కి పైగా జీప్‌లు, భారీ ట్యాంకులు, ట్రక్కులు మొదలైన వాటితో సహా పలు డిఫరెంట్ వెహికల్స్‌కు వాడినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం సినిమాలో చాలా ఆన్‌గ్రౌండ్ యాక్షన్ ఉండడమేనని సమాచారం. హాలీవుడ్ సినిమాల్లో పెద్ద వార్ సీక్వెన్స్ తీసే సమయంలో ఈ రేంజ్లో వాహనాలు, టెక్నీకల్ టీమ్‌ను వాడతారు. మొత్తంగా రోజు రోజుకు అందరిలో భారీ అంచనాలు ఏర్పరుస్తున్న సలార్ మూవీ ఈ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.