Homeతెలంగాణజీతాలు ఇస్తలేరు.. అడిగితే ఉద్యోగం తీసేస్తున్నరు

జీతాలు ఇస్తలేరు.. అడిగితే ఉద్యోగం తీసేస్తున్నరు

• తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TSTCEA) అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్
• న్యాయం చేయాలని గవర్నర్ కు వినతి పత్రం అందజేత

హైదరాబాద్: ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేసే అధ్యాపకులకు గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఎవరైనా ధైర్యం చేసి మేనేజ్మెంట్ ని అడిగితే ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నారని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TSTCEA) అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం ప్రతి విద్యా సంస్థ గ్రూప్ ఏక్సిడెంట్ పాలసీ, గ్రూప్ ఇన్సూరెన్స్ లను అమలు చేయాల్సి ఉందని, కానీ ఈ యొక్క కాలేజీ ఈ నిబంధనలను పాటించడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జివో. నం.45 అమలు చేయాలని చెప్పింది కానీ,అది అమలు కావడం లేదని, అధ్యాపకులు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత్యంతరం లేక ఉపాధి హామీ పనులకు, కూరగాయలు అమ్ముకోవడం, ఇతర పనులకు వెళ్ళి జీవనం గడపాల్సి వస్తుందని ఆవేదన చెందారు. అధ్యాపకులకు న్యాయం చేయాలని మంగళవారం గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ కు వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి. నరేష్, డి. వి.రావు, ఉమ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img