Homeహైదరాబాద్latest Newsసమాజ సేవే ఎల్లాగౌడ్ ట్రస్ట్ లక్ష్యం: ట్రస్ట్ చైర్మన్ రంగా వెంకట్ గౌడ్

సమాజ సేవే ఎల్లాగౌడ్ ట్రస్ట్ లక్ష్యం: ట్రస్ట్ చైర్మన్ రంగా వెంకట్ గౌడ్

ఇదే నిజం, జగదేవపూర్: సమాజ సేవ కార్యక్రమాలు లక్ష్యంగా ఎల్లాగౌడ్ ట్రస్ట్ పని చేస్తుందని ట్రస్ట్ చైర్మన్ రంగా వెంకట్ గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని తిగుల్ గ్రామంలో మహిళ సమాఖ్య భవనానికి పర్నీఛర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి రంగా ఎల్లాగౌడ్ జ్ఞాపకార్థంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా మహిళ సమాఖ్య భవనంలో పర్నిఛర్ లేదని మహిళ సంఘం సభ్యులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే ట్రస్ట్ ద్వారా కుర్చీలు, టేబుల్ అందించడం జరిగిందని చెప్పారు‌. అలాగే గ్రామంలో అన్ని రకాల సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. అనంతరం మహిళ సంఘం సభ్యులు ట్రస్ట్ చైర్మన్ వెంకట్ గౌడ్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మహిళ సంఘం సభ్యులు మున్నీ, పరమేశ్వరమ్మ, లక్ష్మీ, సుజాత, అమీదా, బాలమణి, విఓఏలు రేణుక, కల్పన, రజిత తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img