Homeహైదరాబాద్latest Newsపాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన సమంత.. హీరో ఎవరంటే..?

పాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన సమంత.. హీరో ఎవరంటే..?

విడాకులు అయిన తర్వాత సమంత సరైన సాలిడ్ ప్రాజెక్ట్ ఏది చేయలేదు. ఆమె సినిమాల్లో నటిస్తోంది కానీ సరైన హిట్టు పడడం లేదు. ఒక వెబ్ సిరీస్ చేసింది అందులో ఆమె నటనకు ప్రశంసలు తగ్గాయి కానీ ఎందుకో పూర్తి స్థాయిలో ఆమెకు అది సంతృప్తిని ఇవ్వలేదేమో అనిపిస్తోంది. ఇప్పుడు మయోసైటిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి దాని నుంచి తప్పించుకుని మరోసారి నటన మీద ఫోకస్ పెడుతున్న ఆమెకు ఒక బంపర్ ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తోంది. అది ఎవరితోనో కాదు అల్లు అర్జున్ తోనే.. అల్లు అర్జున్ ప్రస్తుతానికి పుష్ప2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే అట్లీ దర్శకత్వంలో క్షమా చేయబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2024వ సంవత్సరంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన కథ లాక్ అయిందని అట్లీ చెప్పిన కథకి బన్నీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది.

దీనితో ఈ సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటినటులు, టెక్నీషియన్లను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు అట్లీ. అందులో భాగంగానే సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అట్లీ సమంత కలిసి తేరి అనే సినిమా చేశారు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ హిట్ కూడా అయింది. ఇక సమంతకి కథ చెబితే ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన చేసి సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక పుష్పా లాంటి సినిమా తర్వాత అల్లు అర్జున్తో సినిమా పడితే సమంత క్రేజ్ మరో లెవల్ కి వెళ్లడం ఖాయం అని చెప్పొచ్చు. నేషనల్ లెవెల్ లో మెరిసిపోవాలని చూస్తున్నా ఆమెకు ఇది సరైన అవకాశం అని చెబుతున్నారు. ఎందుకంటే ఒకపక్క పుష్ప సినిమాతో నార్త్ లో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక జవాన్ లాంటి సినిమా చేయడంతో అట్లీకి కూడా దాదాపు అలాంటి క్రేజ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సమంత సినిమా చేస్తే ఆమెకి నార్త్ లో బాగా కలిసి వస్తుందని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img