Homeహైదరాబాద్latest Newsఇసుకు రీచ్​కు తాళం

ఇసుకు రీచ్​కు తాళం

– ట్రాక్టర్లను అడ్డుకున్న రైతులు
– సీసీ రోడ్ల కోసం ప్రభుత్వ అనుమతులు
– రంగంలోకి దిగిన పోలీసులు

ఇదే నిజం, ముస్తాబాద్​: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ తుర్కపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గ్రామంలో ఇసుక రీచ్​కు ట్రాక్టర్లు వెళ్లకుండా రైతులు తాళం వేశారు. సీసీ రోడ్లు కోసం ఇసుకను తరలించేందుకు అనుమతులు ఉన్నప్పటికీ రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్క దిద్దారు. భూగర్భ జలాలు అడుగండడంతో పంట పొలాలు నీరు అందకుండా పోతుందని రైతులు చెబుతున్నారు. పంట పొలాలకు వచ్చే నీటి సరఫరా పైపులను పగలగొడుతున్నారని అలాగే పంట పొలాల పక్కనుండే ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని ఉద్దేశంతో తాళం వేసినట్లు తెలిపారు. గతంలో ఈ సమస్యలను స్థానిక తహసీల్దార్​ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇసుక టాక్టర్ లు అన్ని రోడ్డుపై ఎక్కడి క్కడికి నిలిచిపోవడంతో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులు వేసిన తాలాన్ని పగలగొట్టించి యధావిధిగా ఇసుక ట్రాక్టర్లు నడిచేటట్టు చేశారు

Recent

- Advertisment -spot_img