Homeహైదరాబాద్latest Newsఇసుక మాఫియా అరాచకం.. కానిస్టేబుల్ ప్రాణాలను ఖతం చేయబోయిన దుండగులు

ఇసుక మాఫియా అరాచకం.. కానిస్టేబుల్ ప్రాణాలను ఖతం చేయబోయిన దుండగులు

ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న వేములవాడ లో మైనింగ్ ఏడి పై దాడిచేసిన ఇసుక మాఫియా. నేడు ఓ కానిస్టేబుల్ ప్రాణాలను ఖతం చేయబోయారు. వివరాలలోకి వెళ్తే.. ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను కానిస్టేబుల్ సత్యనారాయణ పట్టుకున్నాడు. ఇసుక ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు కానిస్టేబుల్ సత్య నారాయణ డ్రైవర్ ప్రక్కనే కూర్చొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను అతి వేగంతో నడిపి ఇసుక ట్రాక్టర్ పై నుండి కిందకు దుకేశాడు. అతి వేగంతో ఉన్న ఇసుక ట్రాక్టర్ చెరువులో బోల్తా పడడంతో కానిస్టేబుల్ సత్య నారాయణ తీవ్రంగా గాయా పడ్డాడు. వెంటనే కానిస్టేబుల్ సత్యనారాయణ ను కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ తగినంత వైద్య సదుపాయాలు లేకపోవడంతో కానిస్టేబుల్ సత్యనారాయణ ను కరీంనగర్ హాస్పిటల్ నుండి హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించిన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరారిలో ఉన్నాడు.

Recent

- Advertisment -spot_img