ఇదే నిజం, రాయికల్: బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నరు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ.2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్ను పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.