విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్.’ ఈ లవ్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే, కొన్నాళ్ల క్రితం మూవీకి సంబంధించి జరగాల్సిన అమెరికా షెడ్యూల్ వీసాల ఆలస్యం కారణంగా వాయిదా పడినట్లు న్యూస్ వైరల్ అయింది. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం అతి త్వరలో ఈ షెడ్యూల్‌ను అమెరికాలో గ్రాండ్‌గా జరిపి, అనంతరం మిగతా బ్యాలెన్స్ వర్క్‌ను కూడా వేగంగా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన విధంగా సంక్రాంతి కానుకగా మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. గీత గోవిందం అనంతరం మరొక్కసారి విజయ్, పరశురామ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ఎంతమేర ఆడియన్స్ ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే.