– అయ్యగారిపల్లి సర్పంచ్ మామిడ్ శోభన్
ఇదే నిజం, ఇనుగుర్తి: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పెల్లి గ్రామ సర్పంచ్ మామిడి శోభన్ అన్నారు. కేసముద్రం లయన్స్ క్లబ్ శాఖ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడానికి నెలరోజుల ప్రోగ్రాం ఎంచుకోవడం గొప్పవిషయమన్నారు. అయ్యగారి పల్లి వివేకానంద సెంటర్లో గురువారం హంగర్ రిలీఫ్ లో భాగంగా లయన్స్ ఆధ్వర్యంలో అల్పాహార అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బెజ్జం ప్రేమ్ కుమార్, లయన్ ప్రతినిధులు సామకూర నరసయ్య, మామిడి అశోక్, ఎర్నం శ్రీరాములు, చింత కరుణాకర్, గంజి వీరేందర్ రెడ్డి, కొడకండ్ల ప్రభాకర్, మడిపెద్ది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.