Homeహైదరాబాద్latest Newsఅంబేద్కర్ యువజన, మాదిగ సంఘం అధ్యక్షుడిగా సతీష్

అంబేద్కర్ యువజన, మాదిగ సంఘం అధ్యక్షుడిగా సతీష్

ఇదే నిజం: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో శుక్రవారం అంబేద్కర్ యువజన, మాదిగ సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నక్క సతీష్, ఉపాధ్యక్షులుగా కొత్తూరు తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా ఈదుల గంగారం, రైటర్ గా గంగాధర మురళి, సహాయ కార్యదర్శిగా ఈదుల రాజు, ఆర్గనైజర్ కార్యదర్శిగా నీలం అజయ్, 20 కార్యవర్గ సభ్యులతో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ అంబేద్కర్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాలువాల రాజయ్య, ఈదుల రాములు, గంగాధర గంగా నర్సయ్య, నీలం గంగారాం, నరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img