Homeతెలంగాణఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు

ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు

  • మున్నేరు వాగు పరివాహక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి
  • ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు
  • మున్నేరు వాగును పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : భారీ వర్షాలతో పొంగు పొర్లుతున్న వాగులపై ఎప్పటికప్పుడు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష చేస్తున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రాంపూర్ వద్ద మున్నేరు వాగు ఉదృతిని పరిశీలించారు. మున్నేరు వాగు పూర్తి స్థాయిలో పొంగుతుండడంతో దాని పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట జిల్లా జడ్పీ కుమారి ఆంగోత్ బిందు, ఇతర నాయకులు, అధికారులున్నారు.

Recent

- Advertisment -spot_img