Homeహైదరాబాద్latest Newsఊరచెరువును భూకబ్జా నుండి కాపాడండి.. రాత్రికి రాత్రే జేసీబీలతో మట్టిని తరలిస్తున్నారు

ఊరచెరువును భూకబ్జా నుండి కాపాడండి.. రాత్రికి రాత్రే జేసీబీలతో మట్టిని తరలిస్తున్నారు

ఇదేనిజం, లక్షెట్టిపేట: వెంకట్రావుపేట ఊరచెరువును భూకబ్జాల నుండి కాపాడాలని, రాత్రికి రాత్రే జేసీబీలతో మట్టిని తరలిస్తున్నారని, చేరువంతా గుంతలమయంగా మారుతుందని, ఆ గుంతల్లో పడితే మత్సకారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకట్రావుపేట మత్స సహకార సంఘం సభ్యులు ఇరిగేషన్ డీఈకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. మత్సకారులకు ప్రాణాపాయం కలిగేలా పనులు చేపట్టవద్దన్నారు.

ఉపాధి హామీ కూలీలతో చేయించాల్సిన పనులు జేసీబీతో చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుందని ప్రశ్నించారు. చెరువు చుట్టుపక్కల గల రైతులు మెల్లమెల్లగా చెరువును ఆక్రమించుకుంటున్నారని, వారి బారినుండి చెరువును రక్షించాలంటే చెరువు సరిహద్దులు నిర్ణయించి, సరిహద్దు రాళ్ళను వేయాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఇండ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి కల్లూరి అశోక్ కుమార్ తో పాటుగా 70 మంది సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img