Homeహైదరాబాద్latest Newsసూర్య అంటే నీకు అంత వెటకారం అంటూ.. తెలుగు హీరోపై సూర్య ఫాన్స్ ఫైర్

సూర్య అంటే నీకు అంత వెటకారం అంటూ.. తెలుగు హీరోపై సూర్య ఫాన్స్ ఫైర్

తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా ‘కంగువ’. దిశా పటాని హీరోయినిగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో విశ్వక్ సేన్ సూర్య “కంగువ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘సింగం 2’ మూవీలోని ఒక వీడియో చూపిస్తూ.. ఒక సీన్‌లో ఓ అతని సూర్యను విలన్ ఇల్లు ఎక్కడ అని సూర్య అడుగుతాడు .. కానీ నాకు తెలియదు అంటాడు.. ఆవేశంతో సూర్య అతన్ని పట్టుకుని కొట్టాడు. ఈ వీడియో ప్లే చేసిన తర్వాత విశ్వక్సేన్. పాపం అడ్రస్ అడిగితే తెలియదు అని చెప్పినందుకు ఎందుకు సార్ అతన్ని కొట్టారు అంటూ కామెడీగా ప్రశ్న వేసాడు. మీరు చాలా మంచివాళ్లు కదా మరి ఎందుకు అలా చేశారు అంటూ విశ్వక్ సేన్ అన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా సూర్య నవ్వుతూ, డైరెక్టర్ హరి ని అడగండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంపై సూర్య అభిమానులు మాత్రం హర్ట్ అయ్యారు. మా హీరో అంటే నీకు అంత వెటకారంగా కనిపిస్తున్నాడు అని విశ్వక్ సేన్ పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

Recent

- Advertisment -spot_img