Homeహైదరాబాద్latest Newsజాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ కు వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ కు వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు

ఇదే నిజం, జగిత్యాల రూరల్: జాతీయ ఎస్సీ కమిషన్ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్, తెలంగాణ లోని పలు జిల్లాల పర్యటనలో బాగంగా బుధవారం జగిత్యాల జిల్లాకి విచ్చేసి, కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ కు తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా జర్నలిస్టుల తరపున జిల్లా ఉపాధ్యక్షుడు గొడిసెల రమేష్, ప్రధాన కార్యదర్శి మల్యాల సతీష్ కుమార్ లు, ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలు వివరిస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలలో ఎస్సీ జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వినతి పత్రం అందజేశారు. ఎస్సి ఎస్టీ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు వెంటనే కేటాయించాలని, జగిత్యాల జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో అవకాశం కల్పించాలని, జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు వెంటనే కేటాయించే విధంగా చొరవ చూపాలని, ఎస్సి ఎస్టీ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని తెలుపగా ఆయన సానుకూలంగా స్పందించారు.

Recent

- Advertisment -spot_img