Homeహైదరాబాద్latest Newsఅంబర్‌పేటలో స్కూల్ వ్యాన్ బీభత్సం.. దుకాణాల్లోకి దూసుకెళ్లిన వ్యాన్..!

అంబర్‌పేటలో స్కూల్ వ్యాన్ బీభత్సం.. దుకాణాల్లోకి దూసుకెళ్లిన వ్యాన్..!

హైదరాబాద్ అంబర్ పేటలో ఓ స్కూల్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపు తప్పి వెల్డింగ్ షాపు టీ షాపులోకి దూసుకెళ్లింది. వ్యాన్ బీభత్సంలో రెండు దుకాణాల్లోని సామగ్రి ధ్వంసమైంది. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అక్కడ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img