Homeహైదరాబాద్latest Newsవడ్డీ వ్యాపారస్తుల ఇండ్లలో సోదాలు.. ముగ్గురు పై కేసు నమోదు

వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లలో సోదాలు.. ముగ్గురు పై కేసు నమోదు

ఇదేనిజం, మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్ లో నివాసము ఉంటున్న ముగ్గురు వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లలో పోలీసులు శనివారం సోదా చేశారు. ర్యాగళ్ల ఏలేశ్వర్ ఇంట్లో సోదా చేయగా రూ.15 లక్షల విలువగల 2 ప్రామిసరీ నోట్లతో పాటు రూ.8 లక్షల 34 వేల విలువ గల 7 చెక్కులు, 18 ఖాళీ చెక్కులు, 3 లక్షల రూపాయల నగదు పోలీసులకు లభించింది.

వేముగంటి భూమేశ్వర్ ఇంట్లో రూ.63 లక్షల విలువగల 10 ప్రామిసరీ నోట్లు, రూ. 3 లక్షల విలువగల ఒక చెక్కు, 7 ఖాళీ చెక్కులు, లక్ష రూపాయల నగదు పోలీసులకు పట్టుబడింది. ద్యావనపెల్లి రాజారాం ఇంట్లో పోలీసులు జరిపిన సోదాలో రూ.5 లక్షల 70 వేల విలువ గల 20 ప్రామిసరీ నోట్లు, లక్ష రూపాయల నగదు పట్టుబడింది. సోదాల్లో పట్టుబడిన నగదు, ప్రామిసరీ నోట్లు, చెక్కులను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img