Homeరాజకీయాలుఅద్దంకి సెల్ఫ్​గోల్​

అద్దంకి సెల్ఫ్​గోల్​

– కొంపముంచిన నోటి దురుసు
– టీవీల్లో దూకుడు.. ప్రజలకు దూరం
– సీనియర్ల నుంచి సహాయనిరాకరణ
– తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్​
– పనిచేయని రేవంత్​ పలుకుబడి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: నోటి దురుసుతనం అద్దంకి దయాకర్​ కొంప ముంచింది. నిత్యం టీవీల్లో ఊగిపోయే మాట్లాడే అద్దంకి దయాకర్​ ప్రస్తుతం తుంగతుర్తి టికెట్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఆయన అహంకార దోరణి, నోటి దురుసుతనమే కొంపముంచిందని కాంగ్రెస్​ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ వివాద రహితుడు మందుల శ్యామేలుకు కాంగ్రెస్​ టికెట్ దక్కింది. గతంలో మాలమహానాడు అధ్యక్షుడిగా పనిచేసిన అద్దంకి దయాకర్​ ఆ తర్వాత కాంగ్రెస్​ పార్టీలో చేరారు. నిత్యం టీవీల్లో ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడుతుంటారు. అయితే ఈ దూకుడుతనమే.. సమయం సందర్భం లేకుండా మాట్లాడటమే ఆయనకు టికెట్ దక్కకుండా చేసిందన్న వాదన వినిపిస్తోంది. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నిర్వహించిన సభలో కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి వాడిన అసభ్య పదం తీవ్ర దుమారం రేపింది. అదే సభలో ఉన్న జానారెడ్డి, ఉత్తమ్​ సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు. కోమటిరెడ్డి అభిమానులంతా ఈ కామెంట్లతో తీవ్రంగా నొచ్చుకున్నారు. ఈ కామెంట్లు చేసినందువల్లే కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి గతంలో మునుగోడు ప్రచారానికి కూడా రాలేదు. ఈ అంశాన్ని అధిష్ఠానం సీరియస్​ గా తీసుకున్నది. ప్రస్తుతం టికెట్​ ఇవ్వకపోవడానికి అది కూడా ఓ కారణమైంది.

అద్దంకికి రేవంత్ అండ


ఇక మొదటి నుంచి అద్దంకి దయాకర్​కు పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సపోర్ట్​ చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కోమటిరెడ్డికి చెక్ పెట్టేందుకే అద్దంకి దయాకర్​ను ఎంకరేజ్​ చేసినట్టు సమాచారం. అయితే అద్దంకి దయాకర్​కు అదే ప్రతిబంధకంగా మారింది. మరోవైపు ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలను పట్టించుకోరన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గానికి ముఖ్య నాయకులు వెళ్లినప్పుడు కూడా అద్దంకి వెళ్లరన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అద్దంకిని పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది.

శ్యామూల్​పై ఏకాభిప్రాయం


తుంగతుర్తి టికెట్​ కోసం కాంగ్రెస్​ పార్టీ నుంచి అనేకమంది పోటీ పడ్డా.. చివరకు మందుల శ్యాముల్​కు టికెట్ దక్కింది. శ్యామూల్​ గతంలో బీఆర్ఎస్​ పార్టీలో ఉన్నారు. గిడ్డంగుల కార్పొరేషన్​ చైర్మన్​ గా పనిచేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో సీనియర్​ లీడర్లంతా అద్దంకి దయాకర్​ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అద్దంకికి తప్ప ఏ నేతకు టికెట్​ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని పలువురు సీనియర్​ లీడర్లు అధిష్ఠానానికి తేల్చి చెప్పడంతో శ్యామూల్​కు టికెట్ దక్కింది. మొత్తానికి నోటి దురుసుతనం, సమయం సందర్భం లేకుండా మాట్లాడటం తదితర కారణాలతో ఈ సారి అద్దంకి మీద ఎఫెక్ట్​ చూపించింది

Recent

- Advertisment -spot_img