ఉస్మానియా యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నల్లకుంటలోని హిందీ మహా విద్యాలయం అనుమతులను రద్దు చేసింది. ఈ మేరకు హిందీ మహా విద్యాలయ స్వయంప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీకి సిఫారసు చేసింది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు కోర్సు పూర్తి చేసేందుకు ఉస్మానియా యూనివర్సిటీ అవకాశం కల్పించింది. విద్యార్థుల మార్కు లిస్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఓయూ విచారణ కమిటీ విచారణ చేపట్టింది. అక్రమాలు నిజమేనని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారని విచారణ కమిటీ నిర్ధారించింది. ఈ క్రమంలో ఓయూ రద్దు నిర్ణయం తీసుకుంది.