Homeజిల్లా వార్తలుశేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం.

శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం.

ఇదేనిజం,శేరిలింగంపల్లి:

పూర్వ విద్యార్థుల కలయికతో ఉన్నత పాఠశాల కోలాహాలంగా మారింది. 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకను ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాల నాటి మధుర అనుభూతులను ఒకరికొకరు పంచుకున్నారు. అప్పట్లో గురువుల నేర్పిన పాఠాలు జీవితంలో ఎలా ఉపయోగపడ్డయో తెలిపారు. 10 తరగతి 1998 – 1999 బ్యాచ్ విద్యార్థులు కలుసుకుని మధుర అనుభూతులను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థులతో పాటు గురువులు హెడ్ మాస్టర్ ప్రభాకర్ రెడ్డి,చెన్నయ్య ,యాదగిరి, లోకేష్, లక్ష్మీ, జయంతకుమార్, స్వర్ణలీల, వసంతలక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img