Homeహైదరాబాద్latest Newsశ్రీశైలం హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

శ్రీశైలం హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

హైద‌రాబాద్-శ్రీశైలం జాతీయ ర‌హ‌దారిపై శుక్రవారం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఆమ‌న‌గ‌ల్లు మండ‌లం రామనుంత‌ల సమీపంలో ఆర్టీసీ బ‌స్సు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల‌ను హైద‌రాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Recent

- Advertisment -spot_img