ఇదేనిజం, రాయికల్ : జగిత్యాలలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో పలువురు BRS నాయకులు కాంగ్రెస్లో చేరారు. రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రామస్వామిగౌడ్, ఉప్పుమడుగు ఫ్యాక్స్ వైస్ చైర్మన్ దుంపల స్వామిరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ సుందరగిరి మురళి, తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని MLC కోరారు. జకిలేటీ రాజు రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండపల్లి రవీందర్ రావు, సోమ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.