HomeSocial MediaHYD: ముఖానికి కోసిన చైనా మాంజా..

HYD: ముఖానికి కోసిన చైనా మాంజా..

ఇదేనిజం, మల్కాజిగిరి: సంక్రాంతి పండుగ వేళ ఉల్లాసంగా ఎగరవేసే పతంగులు కొన్ని కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. పతంగుల కోసం ఉపయోగించే చైనీస్ మాంజా ప్రాణాంతకరంగా మారింది. బైక్ పై వెళ్తున్న ఓవ్యక్తి ముఖానికి మాంజా తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన నేరేడ్మెట్ PS పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షేక్ పేట్ కు చెందిన అబ్దుల్ హక్(37) బైక్ పై కాప్రాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నేరేడ్మెట్ చౌరస్తాలో మాంజా ముఖానికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడ్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img