Homeసినిమామూడేళ్ల వ‌య‌స్సులోనే లైంగిక వేధింపులు.. ద‌ంగ‌ల్ యాక్ట‌ర్‌

మూడేళ్ల వ‌య‌స్సులోనే లైంగిక వేధింపులు.. ద‌ంగ‌ల్ యాక్ట‌ర్‌

న్యూఢిల్లీ : త‌న‌కు మూడేళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడే లైంగిక వేధింపుల‌కు గురైన‌ట్లు దంగ‌ల్ న‌టీ ఫాతిమా సనా షేక్ తెలిపింది.

తాజాగా పింక్‌విల్లా.కామ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఫాతిమా స‌నా షేక్ తన జీవితంలో చోటుచేసుకున్న‌ భయంకరమైన లైంగిక వేధింపుల అనుభవాన్ని పంచుకున్నారు.

సాధార‌ణంగా త‌మ‌పై లైంగిక వేధింపుల స‌మ‌స్యపై మ‌హిళ‌లెవ‌రూ నోరుతెర‌వ‌న్నారు. ఎందుకంటే వీటి చుట్టూ కుటుంబాల గౌర‌వం, ప్ర‌తిష్ట లాంటివి ముడిప‌డి ఉంటాయ‌న్నారు.

తాను కాస్టింగ్ కౌచ్‌ను సైతం ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు. ఉద్యోగం ల‌భించే ఏకైక మార్గం సెక్స్‌కు అంగీక‌రించ‌డం మాత్ర‌మే అని చెప్ప‌బ‌డిన ప‌రిస్థితులు ఉన్నాయ‌న్నారు. ఫాతిమా ప్ర‌స్తుతం లుడో, సూర‌జ్ పే మంగ‌ల్ భ‌రీ మూవీల్లో న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం ప్ర‌పంచం మారుతున్న‌ట్లు తాను ఆశిస్తున్నాన‌న్నారు. దీనిపై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు ఈ అంశం గురించి భిన్నంగా ఆలోచిస్తార‌నుకుంటున్న‌ట్లు అభిప్రాయ‌ప‌డ్డారు.

Recent

- Advertisment -spot_img