ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో సోమవారం రోజున ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సుమారు 22 లక్షల విలువగల 19 కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి మండలానికి చెందిన సుమారు 22 లక్షల రూపాయల 19 చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటిలలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి పథకాలను అమలు చేయడం జరిగిందని,త్వరలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేసి వారికి అందించడం జరుగుతుందనీ,రాష్ట్ర ప్రభుత్వం పెద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందనీ ఈ సంధర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.