Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అర్ధరాత్రి ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాటు చేశారు. దీంతో పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. కాగా ఈ విమానంలో 73 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా సవ్యంగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు.