బెంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు కేంద్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు మరో అడుగు ముందుకేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా బంగ్లాలో సోదాలు నిర్వహించినట్లు సీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు ఎకరాల్లో ఉన్న ఈ బంగ్లాను ఆదిత్య అల్వా పార్టీలు జరుపుకునేందుకు ఉపయోగించేవాడని అధికారులు తెలిపారు. ఈ కేసులో నిందితుడైన ఆదిత్య అల్వా కేసు దర్యాప్తు మొదలైనప్పటి నుంచి కనిపించకుండా పోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిపై కేసులు నమోదు చేయగా, తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అరెస్టైన వారిలో సినీ నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ, పార్టీ ఆర్గనైజర్ వీరెన్ ఖన్నా, రియల్టర్ రాహుల్, ఆర్టీఓ గుమస్తా బి.కె.రవిశంకర్ ఉన్నారు.
డ్రగ్స్ కేసు.. మాజీ మంత్రి కుమారుడి బంగ్లాలో సోదాలు
RELATED ARTICLES