HomeసినిమాShankar Pan India Movie : చరణ్.. కియారాపై శంకర్ టెస్టు షూట్!

Shankar Pan India Movie : చరణ్.. కియారాపై శంకర్ టెస్టు షూట్!

Shankar Pan India Movie : చరణ్ .. శంకర్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, రేపు పూజా కార్యక్రామాలను జరుపుకోనుంది.

ఈ నేపథ్యంలో ఈ రోజున చరణ్ – కియారా అద్వానిపై శంకర్ టెస్ట్ షూట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో చరణ్ – కియారా లుక్ ఎలా ఉండాలనే విషయంలో శంకర్ ఒక క్లారిటీకి వచ్చేశాడట.

అందుకు సంబంధించిన లుక్ లో వాళ్లు ఎలా ఉండాలనే విషయంలో ఒక జడ్జిమెంట్ కి రానున్నాడని అంటున్నారు.

ఈ ఇద్దరినీ కూడా మరింత కొత్తగా తెరపై చూపించనున్నాడని చెబుతున్నారు.

రేపు జరగనున్న పూజా కార్యక్రమాలకు చాలామంది సినీ ప్రముఖులు హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది.

దసరా నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు.

తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాపై, అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img