Homeఅంతర్జాతీయం#Dinosaur #Shark : డైనోసార్లు అంతరించిపోయినా షార్క్‌లు బతికాయి

#Dinosaur #Shark : డైనోసార్లు అంతరించిపోయినా షార్క్‌లు బతికాయి

కొండలాంటి భారీ ఆకారం, భీకరమైన అరుపులతో ఆరున్నర కోట్ల ఏండ్లక్రితం భూమండలంపై ఏకఛత్రాధిపత్యం వహించిన డైనోసార్లు ఆస్టరాయిడ్ల కారణంగా అంతరించిపోయాయన్న విషయం తెలిసిందే.

అయితే, అవే గ్రహశకలాలు షార్క్‌ చేపలను ఏమీ చేయలేకపోయాయని, అందుకే ఆ జీవ జాతి ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నదని స్వీడన్‌కు చెందిన ఉప్సాలా యూనివర్సిటీ పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు.

6.6 కోట్ల సంవత్సరాల క్రితం ఓ పెద్ద నగరం సైజు ఉన్న ఆస్టరాయిడ్‌ ఒకటి గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోను వేగంగా వచ్చి ఢీకొట్టిందని, దీంతో డైనోసార్లతో కలిపి భూమి, సముద్రం, నదుల్లో ఉన్న సమస్త జీవజాలం అంతరించిపోయిందని పరిశోధకులు చెబుతారు.

అయితే, ఇదే సమయంలో జీవించిన కొన్ని షార్క్‌ జాతులు అనూహ్యంగా బతికిపోయినట్టు వెల్లడించారు.

8.3 కోట్ల నుంచి 5.6 కోట్ల ఏండ్ల క్రితం జీవించిన 1,239 షార్క్‌ శిలాజాల దంతాలను పరిశోధించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు.

ఇందులో ఎనిమిది షార్క్‌ జాతులు ఇప్పటికీ మనుగడలో ఉన్నట్టు వివరించారు.

Recent

- Advertisment -spot_img