Homeహైదరాబాద్latest Newsవైసీపీకి షాక్.. కీలక నేతలు జంప్

వైసీపీకి షాక్.. కీలక నేతలు జంప్

చంద్రగిరి నియోజకవర్గంలో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏళ్ల తరబడి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు టీడీపీలో చేరారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రమణమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముడిపల్లి సురేష్ రెడ్డి, పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, వైసీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంగా బాబు రెడ్డి తదితరులు పార్టీలో చేరారు.

Recent

- Advertisment -spot_img