రైళ్లళ్లో రద్దీకి సంబంధించిన అనేక వీడియోలు ఇటీవల కాలంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రయాణికులు.. రెండు బోగీల మధ్య ఉన్న కప్లింగ్‌పై ఎక్కి ప్రయాణించిన ఘటన వైరల్‌గా మారింది. రైలు తలుపు ద్వారా ఎక్కేందుకు చోటు లేకపోవడంతో కొందరు రెండు బోగీల మధ్య ఉండే కప్లింగ్‌పై ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఓ వ్యక్తి చివరకు కప్లింగ్ మీదే నిలబడి పోవాల్సి వచ్చింది. బీహార్ నుంచి దర్భంగా వెళ్లై రైల్లో ఈ ఘటన జరిగినట్టు వీడియోలో పేర్కొన్నారు.