Homeహైదరాబాద్latest NewsSHOCKING: రుచిగా లేని వంట చేసిందని భార్యను చంపిన భర్త

SHOCKING: రుచిగా లేని వంట చేసిందని భార్యను చంపిన భర్త

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: వంట రుచిగా లేదని తాళి కట్టిన భార్యను హతమార్చిన సంఘటన బాచుపల్లి పీ ఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ బాలాఘాట్ కు చెందిన రవీణ సర్వే (28) నవీన్ దుర్వే భార్య భర్తలు వీరికి 11 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. ముగ్గురు పిల్లలు అనురాధ సర్వే 5 వ తరగతి అన్షు సర్వే 5 సంవత్సరాలు వీరిద్దరూ ఉత్తర ప్రదేశ్ లో బందువుల దగ్గర ఉంటున్నారు. సంవత్సరం బాబు అరుణవ్ సర్వే తమతో కలిసి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో ప్రగతి కన్వెన్షన్ లో లేబర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి వంట విషయంలో గొడవ జరిగింది. బార్య చేసిన వంట రుచిగా లేదని కోపంతో గొడవపడి భార్యను ఇటుకతో తలపై బలంగా కొట్టడంతో బార్య రవీన సర్వే తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని నిందితుడు నవీన్ సర్వే ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img