పెద్దపల్లి జిల్లా, మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్(36)కు నాలుగేళ్ల కింద సంధ్యతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. వీరి మధ్య గొడవలు జరగడంతో ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే అనారోగ్యం కారణంగా సునీల్ 3 రోజుల క్రితం హైదరాబాద్ లో చనిపోయాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు మంథనిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు. సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలను అడ్డుకుంది. సునీల్ ఆస్తిలో తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. న్యాయం జరిగే విధంగా చూస్తామని పోలీసులు సంధ్యకు నచ్చజెప్పడంతో అంత్యక్రియలకు అంగీకరించింది.