మద్యం ప్రియులకు మరో చేదు వార్త. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా లేదని, కొన్ని జిల్లాల్లో మాత్రమేనని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27వ తేదీ సోమవారం జరగనుంది. ఈ ఎన్నికల పోలింగ్‌కు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో నేటి సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మే 27వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.