Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు షాకింగ్ న్యూస్.. 3 రోజులు మద్యం దుకాణాలు బంద్.. ఎందుకంటే..?

మందుబాబులకు షాకింగ్ న్యూస్.. 3 రోజులు మద్యం దుకాణాలు బంద్.. ఎందుకంటే..?

మద్యం ప్రియులకు మరో చేదు వార్త. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా లేదని, కొన్ని జిల్లాల్లో మాత్రమేనని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27వ తేదీ సోమవారం జరగనుంది. ఈ ఎన్నికల పోలింగ్‌కు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో నేటి సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మే 27వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img