విశాఖ జిల్లా గోషాల వద్ద ఉన్న పెట్రోల్ బంకు వద్ద రాజు అనే యువకుడు వీరంగం సృష్టించాడు. తనకు పోలీసులు న్యాయం చేయడం లేదని గ్యాస్ సిలిండర్ పట్టుకుని.. బంకును పేల్చేస్తానని హడావిడి చేశాడు. తాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానినని చెప్పి సిలిండర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించడంతో స్థానికులు పరుగులు తీశారు. చివరికి పోలీసులు రావడంతో గండం గట్టెక్కింది.